మడికెరి, మే 10: పెండ్లి వాయిదా పడిందనే కోపంతో ఓ యువకుడు 16 ఏండ్ల బాలికను కత్తితో తల నరికి దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని సుర్లబ్బి గ్రామంలో గురువారం ఈ అమానుషం చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశ్(32)కు, ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణురాలైన బాలికకు పెండ్లి చేయాలనుకున్నారు.
అయితే అధికారులు రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో బాలిక ఇంటికి వచ్చిన ప్రకాశ్ కోపంతో ఊగిపోతూ బాలిక తల్లిని గాయపరిచి.. బాలికను బయటకు ఈడ్చుకొచ్చి ఆమె తల నరికి.. తలతో పాటు పరారయ్యాడు.