Congress | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్‌సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి అం టూ గాంధీభవన్‌కు ఫోన్‌చేసి ఎంపీ అభ్యర్థుల వివరాలను సేకరించారు.
అనంతరం వారికే నేరుగా ఫోన్‌చేసి.. బీఫామ్స్ సిద్ధమయ్యాయని, ఫోన్‌పే ద్వారా రూ.99 వేల చొప్పున చెల్లించి వాటిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ అభ్యర్థులు నిర్ధారణ కోసం గాంధీభవన్‌కు ఫోన్‌చేసి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.
ఈ మో సాన్ని కాంగ్రెస్ నేతలెవరూ నిర్ధారించకపోయి నా అభ్యర్థులకు ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులెవరూ కాల్స్ చేయడం లేదని, ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని చెప్పడం కొసమెరుపు.