T News | టీ న్యూస్ యూట్యూబ్ చానల్‌పై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని టీ న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. ప్రజలకు టీ న్యూస్ ప్రసారాలు చేరకుండా దుండగులు కుట్ర పన్నినట్లుగా ఆరోపించింది. ఈ ఘటనతో చానల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది.సైబర్ నేరగాళ్ల కుట్రలను తిప్పి కొట్టేందుకు టీ న్యూస్ పోరాటం చేస్తోందని పేర్కొంది.
ఈ మేరకు సైబర్ క్రైమ్ డివిజన్ డీసీపీకి టీన్యూస్ యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. హ్యాకింగ్ చెర నుంచి యూట్యూబ్ చానల్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని కోరినట్లు వెల్లడించింది.
హ్యాకింగ్ చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని టీ న్యూస్ యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా టీన్యూస్ యూట్యూబ్ సేవలను తిరిగి ప్రజలకు ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది.