Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : రాజకీయ కక్షసాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విడిచి.. ‘సైబర్’ అటాక్ చేస్తున్నది. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నది. ఇం దులో ఒకటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో (టీజీసీఎస్బీ)!అసలు లక్ష్యాన్ని విడిచిపెట్టి రాజకీయ కక్షసాధింపు ఎజెండానే అమలు చేయాలని సీఎస్బీపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మార్చి 16న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఆయా స్టేషన్ల పరిధిలోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో కానిస్టేబుళ్లతో కేసులు పెట్టించింది.
నోట్లరద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్ సేవలు పెరిగిపోయాయి. వాటితో పా టే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల దృష్టి తెలంగాణపై, ముఖ్యంగా హైదరాబాద్‌పై పడిందని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, సైబర్ నేరాలను అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను 2023, మే 31 ఏర్పాటు చేశారు. ఆ విభాగానికి సుమారు 500 మంది సిబ్బందిని, నిధులను, టెక్నాలజీ ఆధారిత సామగ్రిని సమకూర్చి అడిషనల్ డీజీ స్థాయి అధికారిని డైరెక్టర్‌గా నియమించారు. ఆ సంస్థ దేశంలో సైబర్ నేరాల తీరును విశ్లేషించి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ సొమ్ము ను కాపాడటంతో అతి కొద్ది కాలంలోనే దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచింది.
ఎంతో మహోన్నతమైన వ్యవస్థగా రూపుదిద్దుకున్న సీఎస్‌బీకి కాంగ్రెస్ పాలనలో రాజకీ య మకిలీ అంటింది. 16 నెలల పాలనపై ప్రజ ల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనేందు కు కాంగ్రెస్ సర్కారు వద్ద మార్గం లేక ప్రశ్నిస్తు న్న వారిపై కేసులు పెట్టిస్తున్నది. సీఎస్‌బీలో పని చేస్తున్న కానిస్టేబుళ్లను బలిపశువులను చేస్తున్నది. సోషల్‌మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లు పెట్టేవారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కానిస్టేబుళ్ల ద్వారా దృషి ్టపెట్టించింది. ఆ కానిస్టేబళ్లతోనే వారిపై కేసులు పె ట్టించి.. జైళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తూ సీఎస్‌బీని దుర్వినియోగం చేస్తున్నది.
సైబర్ మోసాలపై దృష్టిపెట్టాల్సిన సీఎస్బీ అధికారులు ‘ఈ రోజు బీఆర్ఎస్కు చెందిన ఏ కార్యకర్తపై కేసు పెడదామా?’ అని ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నది. వాట్సాప్, సోషల్ మీడి యా ప్రొఫైళ్లను తనిఖీ చేసే అధికారంతో ఒక పార్టీకి చెందిన వారి ఖాతాలపైనే దృష్టిపెడుతున్నారు. కొరియర్, నకిలీ కస్టమర్ కేర్, సెక్స్టార్షన్, రుణ, కేవైసీ, ప్రకటనల మోసాలను, నకి లీ సోషల్ మీడియా ప్రొఫైళ్లను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వాళ్లు.. ఆ పనులను పక్కనబెట్టి, బీఆర్ఎస్ యాక్టివిస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అసలు పని పక్కనపెట్టి.. కొసరు పనిపైనే దృష్టి పె డుతుండటంతో రాష్ట్రంలో సైబర్ నేరాల సం ఖ్య గణనీయంగా పెరిగింది. 2023లో 17, 571 సైబర్ క్రైమ్ కేసులు నమోదైతే 43.33 శాతం పెరుగుదలతో 2024లో 25,184 న మోదయ్యాయి. రాష్ట్రంలో సుమారు 1.14 ల క్షల మంది సైబర్ మోసాల బారిన పడ్డారు. ఒక్క సంవత్సరంలోనే రూ.1,866 కోట్లను పోగొట్టుకున్నారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన టీజీసీఎస్బీని ప్రభుత్వం కక్ష రాజకీయాలకు ఆయుధంగా వాడుకుంటున్నదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి.