HomeTelanganaCs Shanti Kumari Directed The Officials To Submit The Details Of Loss Of Property And Life Due To Heavy Rains And Floods By This Weekend
వారాంతంలోగా నష్టం వివరాలు సమర్పించండి.. అధికారులకు సీఎస్ ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల నష్టంపై మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలతో సమీక్ష నిర్వహించారు.
నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి, జీపీఎస్ కోఆర్డినేట్స్ సహా సమర్పించాలని స్పష్టం చేశారు.