హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత ఏ ఎన్నికలు పెట్టాలన్నదానిపై సీఎస్ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలా.. లేక మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలా..? అన్నదానిపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. అయితే, దేనిపైనా స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికలకు అయితే సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు తెలిసింది. తాత్కాలిక షెడ్యూల్ కూడా సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలతోపాటు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎస్ సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూ సంసరణల ను కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీసీఎల్ఏ కార్యాలయంలో అనుబంధంగా ల్యాండ్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్ ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీ న్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చే శారు. భూన్యాయ చట్టాలు, రెవెన్యూ అం శాల్లో నిపుణులైన ముగ్గురికి కమిటీలో చో టు కల్పించనున్నారు. ఇందులో ఒకటి చీ ఫ్ లీగల్ అడ్వైజర్ పోస్ట్ కాగా రెండు లీగల్ అడ్వైజర్ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ చట్టాన్ని మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు ఇస్తారు. పాలసీలు, చట్టాలు, నియమనిబంధనలు, ఉత్తర్వుల రూపకల్పనలో సాయం చేస్తారని ప్రభు త్వం పేర్కొంది. భూ వివాదాలకు సంబంధించి పెండింగ్ కేసుల్లో ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు అందిస్తారు.