హైదరాబాద్ : తెలంగాణ నూతన సీఎస్ సంజయ్ జాజు ( CS Sanjay Jaju ) గురువారం
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ( Gutta Sukhender Reddy ) ని, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ( Gaddam Prasad Kumar ) ను వారివారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు సీఎస్ పుష్పగుచ్ఛం అందజేసి ,శాలువాతో సత్కరించారు. అనంతరం వారు సీఎస్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు , వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య తదితరులు పాల్గొన్నారు.