వాజేడు, నవంబర్ 5 : తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు శివారులో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ బేస్ క్యాంపును సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఎస్పీ సుధీర్రామ్నాథ్కేకన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఇక్కడి బేస్ క్యాంపు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కర్రె గుట్టలవరకు త్వరలో రహదారి నిర్మాణంచేసి అక్కడ మరో క్యాంపు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ క్యాంపుల ఏర్పాటుతో ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా తిరుగుతారని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమంకోసం తమవంతు సహకారం అందించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ములుగు ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, ములుగు డీఎఫ్వో రాహుల్కిషన్ జాదవ్, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.