హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం(24వ తేదీ)నుంచి చివరి దశ విచారణ చేపట్టనున్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేపడతారు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన వారి విచారణను కూడా ఈ వారంలో ముగించనున్నట్టు సమాచారం. భారత రాజ్యాంగ పదో నిబంధన (ఫిరాయింపు నిరోధక చట్టం) ప్రకారం స్పీకర్ విచారణ చేపడుతున్నారు. ఈ నెల 24న మిగిలిన నాలుగు కేసులపై మౌఖిక వాదనలు వినాలని నిర్ణయించారు. ప్రతి కేసులో ఇరువర్గాలు(పిటిషనర్లు, ప్రతివాదులు) వాదనలు వినిపించనున్నారు.
షెడ్యూల్ వివరాలు..