నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 20: పలు జిల్లాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో శుక్రవారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాలలో పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాతపడింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జొన్న, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
నిజామాబాద జిల్లా భీమ్గల్ మండలంలో వడగండ్ల వానకు వరిపైరు నేలవాలగా, గింజలు రాలిపోయాయి. ఒక్క బాచన్పల్లిలోనే వంద ఎకరాలలో నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. వర్ని మండలంలోని సిద్ధాపూర్లో 50 ఎకరాల్లో జొన్న పంటకు నష్టం జరిగినట్లు రైతులు చెప్పారు.