Crocodile | ధర్మపురి, ఆగస్టు 19 : ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. సరిగ్గా 20 రోజుల క్రితం భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలోనే భక్తులకు చిన్న సైజు మొసలి కనిపించింది. అయితే అది గోదావరి అవతలి ఒడ్డుకు అని అప్పుడు అధికారులు తెలిపారు. మంగళవారం గోదావరి హనుమాన్ ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించడానికి వెళ్లిన పట్టణవాసులకు హనుమాన్ ఘాట్ కు కొంతదూరాన గోదావరి ఒడ్డున కొంచెం పెద్ద సైజు మొసలి కనిపించినట్లుగా పట్టణవాసులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.