Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : సుదీర్ఘకాలం తెలంగాణ సాధన కోసం ఉద్యమించి.. పదేండ్లు రాష్ర్టానికి దిశ, దశను ఖరారు చేసి దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం విరుచుకుపడిన తీరుపై సమాజం నివ్వెరపోతున్నది. నల్లగొండలో ముక్కల భాష, వరంగల్‌లో తొక్కుడు భాష.. అంతకుముందు బజారు భాష.. సభ ఏదైనా కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా సీఎం రేవంత్‌రెడ్డి పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుల్డోజర్లతో తొకిస్తామని, మూసీలో పారేస్తామని నల్లగొండలో ఇష్టారీతిగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ వేదిక సాక్షిగా ‘నిన్ను తొక్కుకుంటా వచ్చిన. నీ సీటును తొక్కుక్కుంటా వచ్చిన.. కేసీఆర్ అనే మొక్క ను మళ్లీ మొలవనీయ.. కాస్కో..చూద్దాం. కుట్రలు చేస్తే ఊచలేనని.. అందర్నీ బొక్కలో వేస్తాం. ఊచలు లెక్కిస్తాం’ అని సీఎం రేవంత్ ఆగ్రహంతో ఊగిపోతూ చేసిన ప్రసంగంపై తెలంగాణ సమాజం నివ్వెరపోతున్నది. మూ సీని ప్రక్షాళన చేసి తీరుతానని, మూసీ అభివృద్ధికి ఎవరెవరు అడ్డుపడతారో పేర్లు ఇస్తే నల్లగొండ జిల్లా ప్రజలతో బుల్డోజర్ తొకించకపోతే తన పేరు మార్చుకుంటానని 9న యా దాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ సభలో చేసిన వ్యాఖ్యల విమర్శలు చల్లారకముందే వరంగల్ వేదికగా మరోసారి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్పై సీఎం రేవంత్ విరుచుకుపడిన తీరుపై విస్మయం వ్య క్తమవుతున్నది. అధికారిక కార్యక్రమమే అ యినా దాన్ని సీఎం రాజకీయ వేదికగా మా ర్చారని, వ్యక్తిగత దూషణల పోటీ వేదికగా మలచారని తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. అసెంబ్లీ వేదికగా విలువైన సూచనలు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరిన మరుక్షణమే ‘అసెంబ్లీకి ఎప్పుడొస్తవో రా.. తారీఖు పెట్టు.. కాస్కో.. నీ సంగతి చెప్తా.. నిన్ను ఫాంహౌజ్‌కే పరిమితం చేస్తా’ అంటూ పరస్పర విరుద్ధమై న వ్యాఖ్యలు చేయటంపై కాంగ్రెస్ శ్రేణులే విస్మయం చెందుతున్నాయి.
వరంగల్‌లో సీఎం చేసిన వ్యాఖ్యల వెను క ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశమైం ది. ‘తెలంగాణ అమ్మ సోనియా.. ఆమె కాళ్లు నేనే కాదు ఇక్కడున్నవాళ్లందరూ (స్టేజీ మీద కూర్చున్నవాళ్లను చూపుతూ) కడిగి వాటిని నెత్తిన చల్లుకుంటాం’ అని పేర్కొనటం, ఆ తరువాత ‘ఈ సీటుకు ఊకనే వచ్చిన్నా.. అందరినీ తొక్కుకుంటా వచ్చిన’ అని మరుక్షణంలోనే ‘కేసీఆర్..నీ సీటును తొక్కుక్కుంటా వచ్చిన’ వ్యాఖ్యానించటం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై పల్లెత్తు మాట అనని సీఎం ఉన్నపళంగా ‘రాష్ట్రం విడిచిపెట్టి పోవాలి. తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపో’ అని హూంకరించ టం వెనుక ఏదో మతలబు ఉంటుందని అభిపాయపడుతున్నారు. రేవంత్ కాంగ్రెస్‌ను టీడీపీ కాంగ్రెస్‌గా మార్చారని, బీజేపీతో దగ్గ రి సంబంధాలు పెట్టుకున్నారని కాంగ్రెస్ హై కమాండ్‌కు చేర్చారని.. దీంతో తానే అందరి కన్నా కాంగ్రెస్‌కు వీరవిధేయుడని ప్రదర్శించేందుకే సీఎం ఆరాటపడ్డారని అందులో భాగమే ఆ ఆగ్రహతపన అని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం బలంగా విశ్వసిస్తున్నది.