హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినవారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో రెవెన్యూ అధికారులతో సమావేశమై న మంత్రి.. జనగామ తదితర ప్రాంతాల్లో బయటపడిన స్టాంప్ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్రమాలపై అధికారులతో సమీక్షించారు. లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా 52 లక్షల లావాదేవీల్లో 4,800 లోపాలు గుర్తించామని తెలిపారు. వీటిలో 3,000 లోపాలు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉన్నాయని చెప్పారు. ఆ మొత్తాన్ని అణాపైసాతో సహా రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయి, లోతైన విచారణ జరిపించి బాధ్యులెవరో తేల్చి చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమో దు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.