హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధానకార్యదర్శి హన్మాండ్ల భా స్కర్ ప్రభుత్వాన్ని కోరారు. పలు రాష్ర్టాలు ఇప్పటికే సీపీఎస్‌ను రద్దుచేశాయని గుర్తుచేశారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.