హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ) : పాత పెన్షన్ సాధన కోసం తాము చేపట్టిన సంకల్ప రథయాత్ర సోమవారం ముగిసినట్టు సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. 33 జిల్లాల గుండా చేపట్టిన ఈ రథయాత్రకు 54 ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయని వెల్లడించారు.
ఈ యాత్ర సమయంలో మరణించిన బాధిత కుటుంబాలను కలిసి సీపీఎస్‌తో జరిగిన నష్టాలను తెలుసుకొన్నామని వివరించారు. ఈ నెల 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.