కల్వకుర్తి, జూలై 16 : సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన జనజాగరణ బస్సుయాత్ర గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చేరుకున్నది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో పెట్టిందని, అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ గురించి మాట్లాడటంలేదని మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.