హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో ఎన్యుమరేషన్ ఫారాలు(ఈఎఫ్)ల పంపిణీ దాదాపు 100 శాతం పూర్తయ్యింది. కానీ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం ఇంకా 60 శాతం కూడా దాటలేదు.
గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం డిజిటలైజేషన్ ప్రక్రియ 58.45 శాతానికి మాత్రమే పరిమితమైంది.