మోస్ట్ వాంటెడ్ ‘ఫౌజీ’
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గురువారం మేకర్స్ ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గురువారం మేకర్స్ ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. 1940 దశకం నాటి స్వాతంత్య్ర సంగ్రామం, రెండో ప్రపంచయుద్ధం తాలూకు సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కల్పిత కథ ఇదని సమాచారం. రిలీజ్ డేట్ పోస్టర్లో ప్రభాస్ కదనరంగంలో క్షతగాత్రుడై రక్తమోడుతున్న దుస్తుల్లో కనిపిస్తున్నారు. బందూక్ చేపట్టి దీర్ఘాలోచనలో ఉన్న ఆయన లుక్ సినిమాలోని భావోద్వేగాల్ని ప్రతిఫలిస్తున్నది.
ఓ యోధుడి త్యాగం, ధీరత్వానికి ప్రతీకలా ఈ లుక్ కనిపిస్తున్నది. ‘1932 నుంచి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు’ అని రాసి ఉన్న స్టాంప్ కూడా కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. భారీ స్థాయిలో యాక్షన్ ఘట్టాలతో పాటు బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఇమాన్వి, మిథున్చక్రవర్తి, అనుపమ్ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్చంద్రశేఖర్, నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

