హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై సర్కార్ స్పష్టతనిచ్చింది. ఈ విద్యా సంవత్సరం టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండవని క్లారిటీ ఇచ్చింది. ‘సర్’, జనగణన ముగిసిన తర్వాతే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుతామని తేల్చిచెప్పింది.
గురువారం కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు టీచర్ల బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను కలిశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఇప్పట్లో బదిలీలు ఉండవని జనగణన ముగిసిన తర్వాతే బదిలీలపై ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘సర్’ కొనసాగుతున్నది. తర్వాత జనగణన ఉంటుంది. మొత్తం ప్రక్రియ ముగియాలంటే 2027 ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.