సంగారెడ్డి, జనవరి 26(నమస్తే తెలంగాణ) : తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీకి వ్య తిరేకంగా పోరాటం చేయకుండా పరోక్షం గా సహకరిస్తుందని సీపీఎం పొలిట్బ్యూ రో సభ్యురాలు బృందా కారత్ మండిపడ్డారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన సీపీఎం నాలుగో రాష్ట్ర మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రె స్ మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటం లేదని, అందుకే ఇండియా కూటమి పై విశ్వాసం సన్నగిల్లుతున్నదని తెలిపారు. మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చే సి.. ఆశవర్కర్లు, అంగన్వాడీలు, ఈజీఎస్ కూలీలకు మాత్రం డబ్బులు చెల్లించ టం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో లిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం నేతలు వీరయ్య, చుక్కా రాములు, రంగారెడ్డి పాల్గొన్నారు.