భద్రాచలం, మే 5: ‘ప్రధాని మోదీ సాబ్, మన్ కీ బాత్ కాదు.. ఆదివాసీల గోడు వినం డి’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత, సీపీఎం జాతీయ నేత బృందా కారత్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలో ఆమె మాట్లాడారు. ఆదివాసీ అనే పదం వినగానే మోదీ భయపడుతున్నారని అన్నారు. ఆదివాసీల హక్కులను కేంద్రంలోని బీజేపీ హరిస్తున్నదని విమర్శించారు. ఆదివాసీలు వనవాసీలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.