ఇల్లంతకుంట రూరల్, మార్చి16 : రైతులు తిరగబడితే కాంగ్రెస్ సర్కారు గల్లంతవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ధ్వజమెత్తారు. రంగనాయకసాగర్ ఎల్ఎం-6 కెనాల్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రిలేనిరాహారదీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.
ఎల్ఎం 6 కెనాల్ తవ్వేంత వరకు రైతుల పక్షాన పోరాడుతామ ని తెలిపారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పతనం తప్పదని హెచ్చరించారు. ఈ నెలాఖరు వరకు ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరించకుంటే ఉద్యమాలు చేస్తామని తెలిపారు.