గోదావరిఖని: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని, తక్షణమే అదుపులోకి తీసుకున్నవారందరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో జిల్లాల్లో నిరసనలు తెలిపితే మోదీకి హానిజరుగుతుందా అని ప్రశ్నించారు. నిరసన తెలియజేయడం పౌరుల ప్రజాస్వామిక హక్కని చెప్పారు. మోదీ పర్యటనను నిరసిస్తూ నిరసన తెలిపేందుకు గోదావరిఖనికి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుల నేపథ్యంలో ఆయన అక్కడే దీక్షకు దిగారు.