హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వం మారుతుందని చెప్పారు. అవినీతిని ఎన్నిరకాలుగా చేయవచ్చో జగన్మోహన్రెడ్డి వద్ద నేర్చుకోవాలని, చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసమే మోదీతో కలిశారని విమర్శించారు. గుజరాత్లోని ముందనార్ పోర్టు నుంచి గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఆరోపించారు.