హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి కోరారు. బుధవారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సాయీశ్వరి, ప్రధాన కా ర్యదర్శి నండూరి కరుణకుమారి,
డి ప్యూటీ జనరల్ సెక్రటరీ సీతామహాలక్ష్మిలతో కలిసి సచివాలయానికి వెళ్లిన ఆయన మంత్రి సీతక్కతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రూ.18వేల వేతనం చెల్లించాలని కోరారు. టీచర్లు, ఆయాల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సూచించారు.