ఉద్యమాలతో మోదీ కండ్లు తెరిపిస్తాం
ప్రధాని మోదీ దేశంలోని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పొట్టగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
- పేదల పొట్టగొట్టి కార్పొరేట్ల కొమ్ము కాస్తారా?
- రేవంత్ సర్కార్ ప్రజలను విస్మరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి
- నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా
- కరీంనగర్లో కదంతొక్కిన సీపీఐ నేతలు
- భద్రాద్రి, ఖమ్మం కలెక్టరేట్ల ముట్టడిలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం గణేశ్టెంపుల్/ ఖమ్మం కమాన్బజార్, కరీంనగర్ తెలంగాణ చౌక్, హైదరాబాద్, జూన్ 10: ప్రధాని మోదీ దేశంలోని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పొట్టగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
ఇంధన, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా సీపీఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద పార్టీ శ్రేణులు బుధవారం భారీ ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యే కూనంనేని ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్లను ముట్టడించారు. పెంచిన ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లలోకి నాయకులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
కరీంనగర్ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించగా తోపులాట జరిగింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఇష్టారాజ్యంగా లాక్కెళ్లారని సీపీఐ నాయకులు మండిపడ్డారు. సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ దోచిపెడుతున్నారని, సామాన్యుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ నుంచి కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

