తెలంగాణ చౌక్, జూలై 19: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లోని సీపీఐ ఆఫీసు బద్ధం ఎల్లారెడ్డి భవన్లో విలేకరులతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేట్ పరంచేసే కుట్రతోనే కేంద్రం బొగ్గుబ్లాకుల వేలానికి తెరలేపింని ఆరోపించారు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉ క్కు పరిశ్రమ, ప్రాణిహిత చేవేళ్లకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుపెట్టే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని కోరారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర సభ్యుడు పోనగంటి కేదారి, సృజన్‌కుమార్, అశోక్‌కుమార్ ఉన్నారు.