భువనగిరి కలెక్టరేట్ ఫిబ్రవరి 27 : ఆవు ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొత్త కృష్ణ అనే పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకోవడం విశేషమని రైతు తెలిపారు. ఒకే కాన్పులో ఆవు రెండు లేగ దూడలను ప్రసవించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు లేగ దూడలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
AAP | జైభీమ్ అన్నందుకు సస్పెండ్ చేశారు.. అసెంబ్లీకి రానీకుండా అడ్డుకుంటున్నారు : ఆతిశీ
Gold: ఖర్జూర పండ్లలో బంగారం.. పట్టుకున్న కస్టమ్స్ ఆఫీసర్లు.. వీడియో
Pooja Hegde Coolie | రజనీకాంత్ ‘కూలీ’లో పూజా హెగ్డే.. ఫస్ట్ లుక్ రిలీజ్