న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో.. బంగారన్ని(Gold) అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 172 గ్రాముల బంగారన్ని స్వాధీనం చేసుకున్నారు. 56 ఏళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు.. జెడ్డా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అతను ఎస్వీ-756 విమానంలో ప్రయాణించాడు. అయితే బ్యాగేజీ చెకింగ్ సమయంలో అతని లగేజీపై అనుమానం వచ్చింది. ఖర్జూర పండ్లలో బంగారాన్ని దాచి.. తీసుకెళ్తున్నట్లు కస్టమ్స్ అధికారులు అనుమానించారు.
పండ్లు ఉన్న మూటను ఓపెన్ చేసి పరిశీలించారు. అయితే ఆ పండ్లలో బంగారు ముక్కలను అమర్చినట్లు గుర్తించారు. ఓ చైన్ కూడా ఆ ఖర్జూర పండ్ల బ్యాగ్లో ఉన్నది. ఖర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Based on spot profiling, Customs officers at IGI Airport intercepted one Indian male passenger aged 56 arriving from Jeddah to Delhi on flight SV-756 yesterday. Examination of his baggage led to the recovery of assorted yellow metal cut pieces and a chain, all believed… pic.twitter.com/sxCrpGMKuj
— ANI (@ANI) February 27, 2025