12 నుంచి 14 ఏండ్ల వారికి టీకాలు
హైదరాబాద్, మార్చి 15 : రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏండ్ల వయస్సు పిల్లలకు బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కా నున్నది. రాష్ట్రవ్యాప్తంగా వీరు సుమారు 17 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు. వారికి ‘కార్బివ్యాక్స్’ టీకా వేయనున్నారు. దీనిని హైదరాబాదీ సంస్థ బయొలాజికల్-ఈ తయారు చేయటం విశేషం. 2008 నుంచి 2010 మధ్య పుట్టిన ప్రతిఒక్కరూ టీకా వేసుకోవటానికి అర్హులని అధికారులు తెలిపారు. రాష్ర్టానికి ఇప్పటికే 11.62 లక్షల డోసులు వచ్చాయి. వీటిని అన్ని జిల్లాలకు పం పిణీ చేసినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. మొదటి డోస్ వేసిన 28 రోజులకు రెండో డోస్ వేస్తారు. వ్యా క్సిన్ సెంటర్లకు పిల్లలతోపాటు కచ్చితంగా తల్లిదండ్రు లు రావాలి. వయస్సు నిర్ధారణ కోసం ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు సూచించారు. కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.