కారేపల్లి, ఆగస్టు 19 : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో(Electric shock) దంపతులు మృతి(Couple dies) చెందారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం (Khammam)జిల్లా కారేపల్లి మండలం బస్వాపు రం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వా పురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40)లు దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలో ఓ కుమార్తె ప్రియాంక జన్మించింది. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అయితే ఉదయం బట్టలు ఉతికిన షమీన ఇంటి ముందున్న ఇనుప తీగ(దండెం)పై ఆరేస్తుండగా.. ఆ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్తో అక్కడికక్కడే పడిపోయింది. అదే సమయంలో వారి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి షమీన కిందపడి ఉండటాన్ని గమనించి ఇంట్లో ఉన్న ఆమె భర్త శ్రీనుకు చెప్పాడు. కొంత కాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న షమీన అప్పుడప్పుడు స్పృహతప్పి పడిపోతూ ఉండేది. అలాగే పడిపోయిందను కున్న శ్రీను తన భార్యను లేపేందుకు యత్నించాడు.
దీంతో అతడికి కూడా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన శ్రీను స్నేహితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ దంపతులను వెంటనే ఇల్లెందు ప్రభుత్వ దవాఖానకు తరలిం చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రాఖీ పౌర్ణమి రోజు భార్యభర్తలిద్దరూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుమార్తె ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ రాజారాం తెలిపారు.