హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య(Couple commits suicide) చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన బెజ్జంకి(Bejjanki) మండలం దాచారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకిలో వస్త్ర దుకాణం దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
కాగా, శ్రీహర్ష తన మధ్యవర్తిగా ఉండి అనిల్ వ్యక్తికి లక్షల్లో అప్పు ఇప్పించాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా అనిల్ స్పందించలేదు. దీంతో అప్పు ఇచ్చిన అభిషేక్, రాజశేఖర్, భూపతి, శ్రీనివాస్ అనే వ్యక్తులు శ్రీహర్షను బెదిరించారు. దీంతో మనస్థాపంతో చెందిన శ్రీహర్ష దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.