ఎల్బీనగర్, అక్టోబర్ 2 : గంజాయి(Ganja) విక్రయిస్తున్న దంపతులను(Couple arrested) ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి ( 25), చల్లా ఉమా మహేశ్వరి (24) ఇద్దరు భార్య భర్తలు. వీరు మాచర్ల గ్రామానికి చెందిన చల్లా శివనాగరాజు వద్ద నుంచి గంజాయిని తీసుకుని వచ్చి నగరంలో గంజాయి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు.
ఈ క్రమంలో అక్టోబర్ 1న ఎల్బీనగర్(LB Nagar) హ్యూందయ్ షోరూం వద్ద యరపతి గోపి, ఉమా మహేశ్వరిలు గంజాయిని నాగోలు జైపురికాలనీ అంధుల కాలనీకి చెందిన తంగెళ్ల ప్రభుచరణ్కు (20)కు గంజాయిని విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 గంజాయి ప్యాకెట్లు, ఒక ఆక్టీవా వాహనం, మూడు సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.