ఇవీ మోదీ ఘనతలు!
30 ఏండ్లలోనే అకాశన్నంటిన ద్రవ్యోల్బణం. 45 ఏళ్లలో గరిష్ఠస్థాయికి నిరుద్యోగశాతం.ప్రపంచంలోనే అధిక వంటగ్యాస్ సిలిండర్ ధర పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ మూడోస్థానం
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యావాలు తెలిపారు. ‘ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతి పల్లెకు చేర్చిన లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ సలాం. కరువు నేలగా పిలిచిన తెలంగాణ నేడు దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగినందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలకు, తెలంగాణ రైతన్నకు సలాం. కంటికి రెప్పలా రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న హోంగార్డు నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు ప్రతి పోలీసుకు సలాం. చంటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒకరికీ అద్భుతమైన, మెరుగైన వైద్యం అందిస్తూ కరోనా కష్టకాలంలోనూ సేవలందించిన మా వైద్య సిబ్బందికి సలాం. రేపటి తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, దేశంలోనే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతున్న మన ఊరు-మన బడి, గురుకులాల్లోని గురువులకు సలాం. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారరీత్యా వివిధ దేశాల్లో ఉంటూ, ఇదీ మా సత్తా అంటూ తెలంగాణ జెండాను విదేశాల్లో రెపరెపలాడిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలకు సలాం. ప్రాణాలకు తెగించి భూమి పొరల్లో నుంచి నల్ల బంగారాన్ని వెలికితీసి, తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో వెలుగులు నింపుతున్న సింగరేణి కార్మికులకు సలాం. పల్లెల్లో, పట్టణాల్లో రాష్ర్టానికి అవార్డులు సాధిస్తూ, ప్రజలకు ఆరోగ్యాన్ని, మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్న పంచాయతీలు, పట్ణణాల్లోని సఫాయిలందరికీ సలాం’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేటప్పుడు 2022వ సంవత్సరంలోపు దేశాన్ని మార్చేస్తానని, ఎన్నో అద్బుతాలు చేస్తానని చెప్పారు. దేశరైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, దేశమంతా బుల్లెట్ ట్రైన్లు ఉరుకుతాయని, 57 లక్షల ఇండ్లు కట్టిస్తానని.. ప్రతి భారతీయుడికి సొంతిల్లు ఉంటుందని, ప్రతి ఇంటికీ విద్యుత్ అందిస్తానని, దేశ ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని, అంతరిక్షంలోకి దేశం నుంచి ఆస్ట్రోనాట్లను పంపుతానని హామీ ఇచ్చారు. ఇందులో ఏ ఒక్కటైనా నెరవేర్చారా?