ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) పత్తి కొనుగోళ్లు(Cotton procurement) ప్రారంభం కాకపోవడంతో రైతులె ఇబ్బందులు పడుతున్నారు. తేమ(Moisture content) పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం పరిగణలోకి తీసుకోకుండా సీసీఐ (CCI)పత్తి కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రాజర్షి షా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. 8 నుంచి 12% తేనే ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు.
దీంతో మార్కెట్కు భారీగా తరలి వచ్చిన రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పంటలు పండించడం ఒక ఎత్తయితే చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం మరో సమస్యగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షి షా