హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): యూపీఏ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాలే కనిపించేవని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అవినీతికి తావులేకుండా 11 ఏండ్లు దిగ్విజయంగా ప్రధాని మోదీ పరిపాలన కొనసాగుతుందని, దేశ సంపదలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్టు పేర్కొన్నారు. రాహుల్కు రాజకీయం, దేశ చరిత్రపై సరైన అవగాహన లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. హామీలను విస్మరించి, ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారని విమర్శించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు మోదీ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.