యాదగిరిగుట్ట, జనవరి 28: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతున్నది. భక్తుల నుంచి వస్తున్న విరాళాలతోపాటు ఇతర రూపంలో వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు, సి బ్బంది గండికొడుతున్నారు.
ఇటీవల స్వా మివారి లడ్డూ ప్రసాదంలో చింతపండు చోరీ ఘటన మరువకముందే తాజాగా ప్రచార శాఖలో విక్రయించే బంగారు, వెండి డాలర్లు మాయమయ్యాయి. వీటి ఖరీదు సుమారు రూ.10లక్షలని అంచ నా. ఇవి ఏడాది క్రితమే మాయం కాగా ఇ టీవల ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టు ధ్రువీకరించారు.
క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమతో కూడిన బంగారు, వెండితో సిద్ధం చేసిన డాలర్లను దాదాపు 20 ఏండ్లు గా విక్రయిస్తున్నారు. మధ్యలో కొన్నేండ్లు వాటి విక్రయాలు నిలిపివేశారు. కేసీఆర్ ప్ర భుత్వం వీటి విక్రయాలను తిరిగి ప్రారంభించింది. అప్పటినుంచి ఈవో పర్యవేక్షణలో దేవస్థాన ఏఈవో ఆధీనంలో కొనసా గే ప్రచార శాఖలో భద్రపరిచి విక్రయాలు సాగిస్తున్నారు.
స్వామి వారికి వివిధ రూపాల్లో వచ్చిన బంగారం, వెండిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మింట్ కంపౌండ్‌కు ఆల య ఈవో అందజేస్తారు. ఇందులో 200 బంగారం డాల ర్లు, 1000 వెండి డాలర్లు సిద్ధం చేసిన తర్వాత ఈవో పర్యవేక్షణలో ఉంటాయి. ఇటీవలి తనిఖీల్లో బంగారం, వెండి డాల ర్లు కనిపించకుండా పోయా యి. దీనిపై దేవస్థాన డీఈవో దోర్బల భాస్కర్‌ను వివరణ కోరగా త్వరలో రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.