హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్స్ విశృంఖలత్వంపై తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టకేలకు అప్రమత్తమైంది. 15 మం ది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం నేపథ్యంలోనే చట్టపరమైన చ ర్యలు చేపడుతున్నారు.
జియో-ఫెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లను యాక్సె స్ లేకుండా చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే 108 వెబ్సైట్లను బ్లాక్ చేసి, మరో 133 ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు జారీ చేసింది.
కాసుల కోసం కకుర్తి పడకండి
హైదరాబాద్, మార్చి 21 (నమస్తేతెలంగాణ): సంపాదన కోసం యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌లను, సమాజాన్ని చెడగొట్టే వ్యాపార ప్రకటనలను ఇవ్వకండని సినీ పరిశ్రమకు సీపీఐ జాతీయ కార్యదర్శి డా క్టర్ కే నారాయణ హితవు పలికారు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు.