బిల్లు చెల్లింపుల్లేక జీపీ భవనానికి తాళం
నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కనగర్తి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ అందెం మల్లారెడ్డి బీఆర్ఎస్ హయాంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను కాంట్రాక్టు పద్ధతిలో పూర్తిచేశారు.
కోనరావుపేట, జూన్ 10: నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కనగర్తి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ అందెం మల్లారెడ్డి బీఆర్ఎస్ హయాంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను కాంట్రాక్టు పద్ధతిలో పూర్తిచేశారు.
భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20లక్షలను సంబంధిత అధికారులు విడుదల చేసింది. అయితే ప్లానింగ్ ప్రకారం భవన నిర్మాణానికి డబ్బులు సరిపోకపోవడంతోపాటు అదనంగా లక్షా 50వేలతో పనులు చేయించానని కాంట్రాక్టర్ వాపోయాడు. అదనపు పనులకు గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తామని అప్పటి పాలకవర్గం చెప్పినప్పటికి, ఇప్పటికీ చెల్లింపులు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసినట్టు తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు రావాల్సిన బిల్లులు చెలించాలని విజ్ఞప్తి చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

