భువనగిరికలెక్టరేట్, ఆగస్టు 26: పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మాజీ వార్డు సభ్యుడు నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి భువనగిరి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.42 లక్షలు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ హనుమంతరావును కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. స్ఫందించిన కలెక్టర్ పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్టు కృష్ణ తెలిపారు. కాగా కృష్ణ చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు.