కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 9: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన కరీంనగర్‌లోని యూనియన్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కొన్ని జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ విడుదలలో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. నెలనెలా వేతనాలందక వారి కుటుంబాలు వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా వేతనాలు, పెన్షన్ల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, సంగెం లక్ష్మణ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగుల నర్సింహాస్వామి, కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.