హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 202122లో 30 జిల్లాల్లో బడ్జెట్ ల్యాప్స్ కావడంతో పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందలేదు. ఈ విషయాన్ని అధ్యాపక సం ఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం అధ్యాపకుల పెండింగ్ వేతనాల కింద రూ.21,88,33,287ను ఇంటర్ విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి డాక్టర్ కే సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, హరీశ్‌రావు ఇతర ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.