గద్వాల/అయిజ, జూన్ 17 : జూరాల ప్రాజెక్టుకు వర ద కొనసాగుతున్నది. సోమవారం 8,849 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,779 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.869 టీఎంసీలున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్ప వరద కొనసాగుతున్నది. 4,329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 4,329 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉన్నది. తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 1,850, అవుట్‌ఫ్లో 301 క్యూసెక్కులుగా నమోదైంది. టీబీ డ్యాంలో ప్రస్తుతం 6.070 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.