Andhrajyothy | గజ్వేల్, జూలై 31: అంధజ్యోతి మళ్లీ విషం కక్కింది. ఈసారి వైకుంఠ ధామాలపై పడింది. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలన్న విషయం మర్చిపోయి నిర్లజ్జగా మరో వార్తను వండి వార్చేసింది. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో ఆదివారం మృతి చెందిన మల్లయ్య అంత్యక్రియలను చెరువు నీటిలోనే కానిచ్చేశారంటూ అచ్చొచ్చిన అబద్ధాలను నిస్సిగ్గుగా అచ్చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ వైకుంఠధామాలు ఉన్నాయి.
గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, మర్కూక్, వర్గల్, ములు గు మండలాల్లో 148గ్రామ పంచాయతీలు ఉండగా 146 గ్రామాల్లో వైకుంఠధామాలు అ త్యాధునిక హంగులతో పూర్తయ్యాయి. ఒక్కో దానికి ప్రభుత్వం రూ.12.60 లక్షలు వెచ్చిం చింది. కొన్ని గ్రామాల్లో ప్రహరీల నిర్మాణానికి మరో రూ. 10 లక్షలు ఖర్చు చేసింది. ప్రజలు వాటిలోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి, ములుగు మండలంలోని తునికిబోల్లారం గ్రా మాల్లో భూ సమస్య కారణంగా వైకుంఠ ధా మాల నిర్మాణం పూర్తికాలేదు.
ప్రజ్ఞాపూర్‌లో క్యాసారం వెళ్లే మార్గంలో 28 గుంటల విస్తీర్ణంలో రూ.25 లక్షలతో వైకుంఠధామం పనులను ప్రారంభించి రూ. 15 లక్షలతో స్నానపు గదులు, బర్నింగ్ ప్లాట్‌ఫాంలు నిర్మించారు. అక్కడ భూ సమస్య కారణంగా కొన్ని పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేయడంతో పనులను పూర్తిచేసేందుకు పంచాయతీ అధికారులు రీటెండర్ పిలిచారు. వీలైనంత త్వరగా దానిని కూడా పూర్తిచేయాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించినా భూ సమస్యకు తోడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అక్కడ వైకుంఠధామం పనులు పూర్తికాలేదన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. అసలు విషయం ఇది కాగా, ఆంధ్రజ్యోతి మాత్రం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భూ సమస్యలను కూడా ప్రభుత్వం మీదికి నెట్టే ప్రయత్నం చేస్తూ తన వక్రబుద్ధిని చాటుకున్నది. 148 గ్రామాల్లో 146 చోట్ల వైకుంఠ ధామాలు పూర్తి కాగా అం ధజ్యోతికి అవేవీ కనిపించలేదు. ప్రజ్ఞాపూర్‌కు సమీపంలోని క్యాసారంలో మరో వైకుంఠధా మం ఉన్నప్పటికీ గ్రామస్థులందరిలానే మల్ల య్య కుటుంబ సభ్యులు కూడా సెంటిమెంటుగా చెరువు గట్టునే అంత్యక్రియలు పూర్తిచేశారు. నీటిలో కొంతదూరం నడుచుకుంటూ వెళ్లారు. సరిగ్గా అప్పుడే ఆంధ్రజ్యోతి ఓ ఫొటో తీసి వార్త రాసేసి పాఠకుల మీదకు వదిలింది.