Singareni | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్‌లో అద్భుత వృద్ధిని సాధించింది. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసింది. గత 8 ఏండ్లల్లో 14 కొత్త గనులను సాధించింది. మరో 8 గనులు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. 2014కు పదేండ్ల ముందు కేవలం 6,453 ఉద్యోగాలిస్తే, కేసీఆర్ హయాంలో 19,463 మందికి ఉద్యోగాలిచ్చింది. మరో 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలిచ్చింది. నోటిఫికేషన్ల ద్వారా మరో 4,207 ఉద్యోగాలిచ్చింది. 3,490 మందికి పదోన్నతులు కల్పించింది. సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61కు ఏండ్లకు పెంచింది. 2021 మార్చి 30 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. 11,685 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు 2016-23 వరకు 58,556 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసి, 55,034 మిలియన్ యూనిట్లను రాష్ర్టానికి సరఫరా చేసింది. సింగరేణివ్యాప్తంగా 300 మెగా సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేస్తుండగా, వీటిలో 224 మెగావాట్లను గ్రిడ్‌కు అనుసంధానించారు. జలాశయాల్లో తేలియాడే 350 మోగావాట్ల సోలార్ ప్లాంట్లను సైతం సంస్థ ఏర్పాటు చేస్తున్నది.
బొగ్గు ఉత్పత్తి (మెట్రిక్‌టన్నులు)
బొగ్గు రవాణా (మెట్రిక్‌టన్నులు)
బొగ్గు విక్రయాల (కోట్లల్లో)
నికరలాభం (కోట్లల్లో)
ఓవర్‌బర్డెన్ తొలగింపు (మిలియన్ క్యూ.మీ.)