ములుగు : పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఈవీఎం గోదామును కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ..ఈవీఎం గోదాముల నిర్మాణం చేపట్టాలని ఆదేశించిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తక్కువ సమయంలో నిర్మాణ పనులను పూర్తి చేసి గోదామును ప్రారంభింప చేయడం అభినందనీయమన్నారు.
అంతకు ముదు జయశంక్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా నిర్మించిన ఇవీఎం, పీపీ ప్యాట్లను భద్రపరిచే గోడౌన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ప్రారంభించారు.