కోమటిరెడ్డి కుయుక్తులు
చలో నల్లగొండ సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు, కుయుక్తులు విఫలమయ్యాయి. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన వెంటనే నల్లగొండలో తిరగనివ్వం.. అడ్డుకుంటామని ప్రకటన చేశారు. ఆ వెంటనే జిల్లాలో 30, 30(ఏ) సెక్షన్లు అమలు చేస్తున్నట్టు పోలీస్ శాఖ ప్రకటించింది.
- చలో నల్లగొండ సభపై కుట్రలు
- అడుగడుగునా అడ్డంకులకు ప్రేరేపితం
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): చలో నల్లగొండ సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు, కుయుక్తులు విఫలమయ్యాయి. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన వెంటనే నల్లగొండలో తిరగనివ్వం.. అడ్డుకుంటామని ప్రకటన చేశారు. ఆ వెంటనే జిల్లాలో 30, 30(ఏ) సెక్షన్లు అమలు చేస్తున్నట్టు పోలీస్ శాఖ ప్రకటించింది. దాంతో సభ నిర్వహణకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ నేతలు లేఖ అందజేస్తే రెండు రోజుల సుదీర్ఘ సమాలోచనల తర్వాత పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు సోమవారం కేసీఆర్ నల్లగొండకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల పేరుతో హైడ్రామా సృష్టించారు.
మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు క్లాక్‌టవర్ సెంటర్లో ఖాళీ కుర్చీ వేసి అందులో కేసీఆర్ చిత్రపటం పెట్టి ఏదో చేయబోయారు. కానీ దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. నల్లగొండకు చేరుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇంటిలో మధ్యాహ్న భోజనం ముగించుకుని సభా ప్రాంగణానికి బయల్దేరారు. మార్గమధ్యంలో పది మంది కూడా లేని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు బస్సుకు అడ్డం వచ్చి కోడిగుడ్లు విసిరేందుకు యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పక్కకు తప్పించారు. సభ ప్రకటించిన నాటి నుంచి ఏదో రకంగా బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించేందుకు కోమటిరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎటుచూసినా నల్లగొండ జనసంద్రంగా మారింది. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని పట్టణ ప్రజలు వ్యాఖ్యానించడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

