హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.
1వ తేదీన: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ 2వ దశకు శంకుస్థాపన, విద్యార్థులకు వ్యాసరచన, సీఎం కప్ పోటీలు.
2న: 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలు, 213 కొత్త అంబులెన్సులు, 33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ల ప్రారంభం.
3న: హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు, ఆరాంఘర్-జూపార్ ఫె్లైఓవర్ ప్రారంభం, కేబీఆర్ పార్క్ వద్ద జంక్షన్ల పనులకు శ్రీకారం.
4న: ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన, వృక్ష పరిచయ కేంద్రం ప్రారంభం, 9,007 మంది నియామకం
5న: ఇందిరా మహిళాశక్తి బజార్ ప్రారం భం, స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు, మేడ్చల్, మల్లేపల్లి, నల్లగొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం.
6న: యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం.
7న: డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం.
8న: 7 ఏఐ ప్రాజెక్టులు, 130 కొత్త మీ సేవల ప్రారంభం, ఏఐ సిటీకి భూమి పూజ, స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన.
9న: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ట్యాంక్‌బండ్‌పై ముగింపు వేడుకలు, డ్రోన్‌షో, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు.