హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఐడ్వెజరీ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిందని నేతలు పేర్కొన్నారు. దీంతోపాటు 2009-2014 మధ్యకాలంలో ఎంపీలుగా పనిచేసిన వారినీ ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, కేశవరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ విజయశాంతి ఈ సమావేశానికి హాజరయ్యారు. తాము ఎంపీలుగా పనిచేసినపుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటు సమావేశాల్లో ఆనాడు జరిగిన పోరాటం గురించి, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నేతలుగా తాము చేపట్టిన పోరాట ఘట్టాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీని రూపొందించాలని నిర్ణయించినట్టు మధుయాష్కీ ఈ సందర్భంగా చెప్పారు.