V Hanumantha Rao | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కలిశారు. ఈ భేటీ విజయవాడలో జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత సీఎం దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయితీ పరుడు అని.. ఆయన పేరిట ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎంను వీహెచ్ కోరారు. దీంతో పాటు ఏపీలోని ఒక జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని సీఎం చంద్రబాబుకు వీహెచ్ విజ్ఞప్తి చేశారు. తన ప్రతిపాదన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వీ హనుమంతరావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
The Waking of a Nation | జలియన్ వాలాబాగ్ ఉదంతంపై వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా.!
Vivek Ramaswamy | ఓహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి.. సిన్సినాటిలో ఎన్నికల ప్రచారం